ఓటు చోరీకి వ్యతిరేకంగా నిరసన: రాహుల్ గాంధీ నాయకత్వంలో దిల్లీలో పోరాటం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: వికారాబాద్
భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశ రాజధాని దిల్లీలో శ్రీ రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించిన జన రణభేరి కార్యక్రమంలో భారీగా ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ చేపడుతున్న ఓటు చోరీ విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రజా పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి దిగిపోయే వరకు ఈ సడలని పోరాటం ఆగదని హెచ్చరించారు.