మాయలేడి సినిమా ట్రైలర్ లాంచ్: ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ నిర్మించిన మాయలేడి చిత్రం ఈ నెల పదమూడో తేదీన విడుదల కానుంది. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో, నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ ఇది అద్భుతమైన ప్రేమకథ అని, ప్రేక్షకులు హాయిగా ఎంజాయ్ చేసే మ్యూజికల్ లవ్ స్టోరీ అని వెల్లడించారు. ఏడాది పాటు కష్టపడి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.