టైసన్ నాయుడు: మదరాసి రబ్బరు బొమ్మ మాస్ ఫోక్ సాంగ్ విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న టైసన్ నాయుడు సినిమాకు సంబంధించి మేకర్స్ సంగీత ప్రచారాలను ప్రారంభించారు. ఈ చిత్రంలోని మదరాసి రబ్బరు బొమ్మ అనే మాస్ ఫోక్ సాంగ్‌ను నవంబర్ ఆరో తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.