రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కలకలం
రిపోర్టర్: సతీష్
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ చిత్రం రామాయణ నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం వెలువడింది. ముంబైలోని ఆయన సంస్థ ప్రైమ్ ఫోకస్ తో పాటు ఆర్థిక సలహాదారుల కార్యాలయాల్లో విదేశీ లావాదేవీల పత్రాలపై అధికారులు ఆరా తీశారు. ఈ తనిఖీల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ప్రైమ్ ఫోకస్ షేరు విలువ సుమారు ఎనిమిది శాతం వరకు పడిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.