రైస్ మిల్లుల్ లో తూకం మోసాలు: తనిఖీల్ లో వెలుగుచూసిన అక్రమాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండలంలోని పలు రైస్ మిల్లుల్ లో నిర్వహించిన తనిఖీల్ లో తూకం మోసాలు వెలుగుచూసినట్లు సివిల్ సప్లైస్ అధికారులు స్పష్టం చేశారు. ఉప్పరిగూడలోని విశ్వనాథ్ ఇండస్ట్రీస్ లో ఇరవై ఐదు కిలోల బియ్యం ఉండాల్సిన బస్తాలో కేవలం ఇరవై నాలుగు కిలోలు మాత్రమే ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.