భారీ వర్షాలు, సాంకేతిక సమస్యల నడుమ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిషత్ పోలింగ్
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
వర్షాలు మరియు సాంకేతిక సమస్యల నడుమ రాష్ట్రంలో పరిషత్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఓటర్లు వర్షాన్ని లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాకినాడ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్ లో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల వద్ద నీరు నిలిచిపోయినా, ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉండి ఓట్లు వేస్తున్నారు.