హైదరాబాద్ వాసి దుర్మరణం: విమానాశ్రయంలో జరిగిన మిస్సైల్ దాడిలో యూసుఫ్ మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
సౌదీ అరేబియాలోని విమానాశ్రయంలో జరిగిన ఆకస్మిక మిస్సైల్ దాడిలో హైదరాబాద్కు చెందిన యూసుఫ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి మదీనా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు ఓవైసీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.