పారా ఆసియా క్రీడల్లో సంచలనం: మూడు పతకాలు సాధించిన ఏలూరు ఈతగాడు రవి

రిపోర్టర్: నరేష్ స్థలం: ఏలూరు

జపాన్లోని నగోయా వేదికగా జరిగిన ఐదవ పారా ఆసియా క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఏలూరు జిల్లాకు చెందిన పారా స్విమ్మర్ బుడిగిన రవి కార్తీక్ ఏకంగా మూడు పతకాలను కైవసం చేసుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. వంద మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగాలలో రజత పతకాలను, యాభై మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించి దేశ కీర్తిని ఇనుమడింపజేశారని వారు వెల్లడించారు.