పెరిగిపోయిన బియ్యం ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు
రిపోర్టర్: రాము
స్థలం: నంద్యాల
ఎల్నినో ప్రభావంతో వరి సాగు తగ్గడంతో మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలు భారీగా పెంచేశారు. నంద్యాలలో సోనా మసూరి క్వింటా రూ.8,200కు, కర్నూలులో రూ.7,800కు చేరింది. నెల రోజుల్లోనే 25 కిలోల ప్యాకెట్ రూ.2,050కు ఎగబాకడంతో పేద, సామాన్య వర్గాల ప్రజలు బియ్యం కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయితీ కేంద్రాలు మూతపడటం, అధికారుల తనిఖీలు కొరవడటంతో ధరల నియంత్రణ సాధ్యం కావడం లేదు.