ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారమంటూ ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

ఉక్రెయిన్తో దాదాపు నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. శాంతియుత పరిష్కారం కోసం మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించాలని ప్రయత్నించే నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరని, పరస్పరం ఆమోదయోగ్యమైన మార్గాల కోసం ఆయన తనవంతు కృషి చేస్తున్నారని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు.