ఏలేశ్వరం గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా పాలకవర్గ అభినందన సభ

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ఏలేశ్వరం

ఏలేశ్వరం లో మండల ప్రజా పరిషత్ పాలకవర్గ అభినందన సభ స్థానిక వేదిక గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల నుండి ప్రజా నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు స్థానికంగా 5000 మంది అభిమానులు హాజరవ్వనున్నట్లు స్థానిక ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి తెలియజేశారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.