తెలంగాణ రక్షణ సేన పార్టీకి కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ రక్షణ సేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రత్యేక దృష్టి సారించారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌ల నియామకం పూర్తయింది. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు.