ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన కలెక్టర్

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 1,568 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 11 వేల మంది సిబ్బందిని, 3 వేల మంది పోలీసులను ఎన్నికల విధులకు నియమించినట్లు వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు.