రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు: హోం శాఖ ఉత్తర్వులు జారీ

రిపోర్టర్: హరి స్థలం: Amaravati

రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. రాజమహేందరవరం, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల కోసం కూటమి ప్రభుత్వం ఈ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. కొత్తగా పోస్టులను సృష్టించకుండా వివిధ ప్రాంతాలలోని పోస్టులను వీటికి కేటాయించామని, ఈ కమిషనరేట్లకు ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తారని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.