నెల్లూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్ వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నూతన గణేష్ మండపాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించగా, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.