చిట్వేల్ ఆశ్రమంలోని వృద్ధులకు నిత్యావసరాలు అందించిన దాతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన భయాంజనేయ స్వామి ఆశ్రమంలో వృద్ధుల భోజన సౌకర్యం కోసం దాతలు ముందుకు వచ్చారు. రాజంపేట ఎర్రబెల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఐదు వేల రూపాయల విలువైన బియ్యం ప్యాకెట్లు, పప్పు దినుసులు, కూరగాయలను ఆశ్రమంలోని వృద్ధులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం పట్ల ఆశ్రమ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.