గువాహటిలో దారుణం: హోటల్ లీజు వివాదంలో ఐదుగురు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: Guwahati
అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని పోలీసు కమీషనర్ పార్థ సారథి మహంత వెల్లడించారు. బోరా సర్వీస్ ప్రాంతంలోని హోటల్ బిలాస్ ఇన్ వద్ద ఈ దారుణం జరిగిందని, హోటల్ లీజు వివాదమే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడు ఘనకాంత గొగోయ్ను అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.