విద్యుత్ బకాయిదారులకు తీపి కబురు: ఓటీఎస్ గడువు పొడిగిస్తూ ఏపీఈఆర్సీ ఉత్తర్వులు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
విద్యుత్ బిల్లుల బకాయిలతో సరఫరా నిలిచిపోయిన సర్వీసులు మరియు పరిశ్రమల వినియోగదారులు పెండింగ్ బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కంల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ఈ వెసులుబాటును వినియోగదారులు 2027 జూన్ వరకు సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.