ఆపదలో ఉన్న విద్యార్థినులకు భరోసానిచ్చి అండగా నిలిచిన ఎంపీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుప్పం
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ మాదనపల్లి ఎస్సీ దళితవాడకు చెందిన రమ్య, కావ్యలను పరామర్శించిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. మీ ఉన్నత విద్యకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS, బహుజన సేన నాయకులు వెంకటేష్ మాదిగ, గోవిందప్ప మాదిగ, ఎంపీ ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.