దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపుపై అనన్య దాస్ గుప్తా ప్రత్యేక విశ్లేషణ

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

భారతదేశ సంస్కృతి మరియు దీపావళి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త గుర్తింపును సంపాదించుకుంటున్నాయని జర్నలిస్ట్ అనన్య దాస్ గుప్తా పేర్కొన్నారు. లండన్ లోని హారోడ్స్ నుండి న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం వరకు భారతీయ సంప్రదాయాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయని ఆమె వెల్లడించారు. దేశ ఆర్థిక వృద్ధి కారణంగా ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు భారత్ వైపు ఆకర్షితులవుతున్నాయని వివరించారు. కేవలం వ్యాపారమే కాకుండా మన దేశ హస్తకళలు, డిజైనర్లు ప్రపంచ లగ్జరీ రంగ రూపురేఖలను మారుస్తున్నాయని తెలిపారు.