హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లోపాలతో పింఛనుదారులకు తప్పని తిప్పలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
వైకాపా హయాంలో వాలంటీర్ల ద్వారా నిర్వహించిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ తప్పుల తడకగా మారడంతో నెల్లూరు జిల్లాలో పింఛను దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాపింగ్‌లో పేర్లు సరిగ్గా లేకపోవడంతో వితంతు పింఛన్లు, సంక్షేమ ఫలాలు నిలిచిపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తక్షణమే సవరణలు చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.