రాజుపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజ్మీర రాజు ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట మండలం రాజుపేట గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజ్మీర రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు మండల నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి కిరణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు యువత అంతా ఐక్యంగా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని నూతన అధ్యక్షుడు రాజు స్పష్టం చేశారు.