స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ: సీట్ల సర్దుబాటుపై కసరత్తు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయిలో బలాబలాలు, ఓట్ల చీలికను అరికట్టే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి బలమైన కేడర్ ఉందో అంచనా వేసి, కూటమి ఐక్యతకు భంగం కలగకుండా అడుగులు వేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.