ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ దరఖాస్తులు ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తమిళనాడు

ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ అక్టోబర్ 2026 కోహెర్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు వివిధ అకడమిక్ రంగాలపై అవగాహన కల్పించేందుకు ఈ కోర్సులు దోహదపడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ మద్రాస్ సూచించింది.