జర్మనీలో హలోవీన్ అల్లర్ల బీభత్సం: ఫ్రాంక్ఫర్ట్ లో చెలరేగిన ఘర్షణలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఫ్రాంక్‌ఫర్ట్

జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో హలోవీన్ వేడుకల సందర్భంగా చెలరేగిన అల్లర్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ఆందోళనకారులు దుకాణాలను ధ్వంసం చేసి, దోపిడీకి పాల్పడటంతో వంద మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని అంతర్గత వ్యవహారాల మంత్రి అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ వెల్లడించారు. ఈ ఘర్షణల్ లో యాభై నాలుగు మందిని అరెస్టు చేశామని, హింసాకాండతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు.