మృతి చెందిన మత్స్యకారుడి కుటుంబానికి మంత్రి అచ్చెన్నాయుడు అండ
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
కర్ణాటకలోని మంగళూరులో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా జీరుపాలెం మత్స్యకారుడు సూరాడ రామస్వామి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.