సినిమా రివ్యూ: కామ్రేడ్ కల్యాణ్ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఇదొక మాస్ కామెడీ సినిమా అని, ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారని హీరో శ్రీవిష్ణు తెలిపారు. ఆయన తాజా చిత్రం కామ్రేడ్ కల్యాణ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందని, అందరూ తనను కామ్రేడ్ అని పిలుస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమా ఆద్యంతం వినోదంతో అందరినీ ఆకట్టుకుంటున్నదని కోన వెంకట్ పేర్కొన్నారు.