చిన్నారుల ఆరోగ్య రక్షణకై అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా పోషణ మాసోత్సవం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మహమ్మదాపురం సెక్టార్ పరిధి సూర్యపాళ్యం అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 నుండి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించే విధానాన్ని తల్లులకు వివరించారు. రోజూ వేడి భోజనంతో పాటు గుడ్డు, పాలు అందించాలని అధికారులు సూచించారు.