విజయనగరంలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం వేడెక్కింది
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. తెదేపా, వైకాపా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. తెదేపా కార్యాలయంలో కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరగగా, వందశాతం విజయం సాధించాలని నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు పూల్‌బాగ్‌లో జరిగిన వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని, ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.