ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ: అధికారులకు సీఈవో వివేక్ కీలక ఆదేశాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల సడలింపుతో విచారణలు సులభతరమయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, తొలిసారి ఓటర్లను పెద్దఎత్తున నమోదు చేయాలని సీఈవో స్పష్టం చేశారు.