'సాధారణ వినియోగదారులపై ఎలాంటి భారం పడదు': ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త నిబంధనలు తెస్తున్నప్పటికీ సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్‌ నిగమ్ స్పష్టం చేశారు. డిజిటల్ పేమెంట్లను ఆర్థికంగా నిలకడగా మార్చేందుకు కొత్త మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ విధానం అవసరమని, పీటుపీ, పీటుఎం లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఆయన తెలిపారు.