జన్నారంలో ప్రేమ జంటపై దాడి యువతిని అపహరించిన తల్లిదండ్రులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ వినాయకనగర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు దాడి చేశారు. అద్దె ఇంట్లో ఉంటున్న నాగరాజుపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై ఉదయ్ కిరణ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ఈ దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది.