తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భారీ ఊరట: గ్యాస్ సిలిండర్లపై ఓటీపీ నిబంధన ఎత్తివేత

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీకాకుళం

అర్నాబ్ తుపాను ధాటికి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల పంపిణీ వేగవంతంగా జరిగేలా ఓటీపీ ధ్రువీకరణ నిబంధన నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తుపాను తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి, మొబైల్ నెట్వర్క్లు దెబ్బతిన్న నేపథ్యంలో వినియోగదారులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.