హర్యానాలో రూ.400 కోట్లతో 150 పాఠశాలల భవనాల పునర్నిర్మాణం

రిపోర్టర్: రాము స్థలం: Haryana

హర్యానాలో రూ.400 కోట్ల వ్యయంతో 150 పాఠశాలల భవనాలను పునర్నిర్మించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తెలిపారు. లాడ్వా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా పలు గ్రామాభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు.