టెక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: త్వరలో ఒప్పో రెనో 17 సిరీస్ లాంచ్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న రెనో 17 సిరీస్ ఫోన్లకు సంబంధించిన కీలకమైన వివరాలు లీకయ్యాయని టెక్ నిపుణులు డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించారు. ఈ కొత్త సిరీస్ లో భాగంగా రెనో 17 మరియు రెనో 17 ప్రో ఫోన్లను చైనాలో ఈ నెలలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్లలో పవర్ ఫుల్ బ్యాటరీలు అలాగే శక్తివంతమైన ప్రాసెసర్లు అమర్చనున్నట్లు సమాచారం అందుతోంది.