దక్షిణాది సీట్ల పెంపుపై కాంగ్రెస్ డ్రామా: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర ధ్వజం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్ల పెంపు అంశంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ, అందరికీ ఆచరణాత్మకమైన శాతం సీట్లు పెంచే ఫార్ములా తెస్తే సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు నచ్చడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఎన్నికల సంఘంపై నిందలు వేస్తున్నారని స్పష్టం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం తగదని మండిపడ్డారు.