తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, ఏసీబీ సంచలనం

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుపతి

తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో ఎం. లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించగా రూ. 5 కోట్ల విలువైన అక్రమాస్తులు, 2 కేజీల బంగారం, నగదు బయటపడ్డాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కొద్ది రోజుల ముందు ఈ అరెస్టు జరగడం టీటీడీలో కలకలం రేపింది. ఏసీబీ కేసు నమోదులో వైరుధ్యాలు ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. లోకనాథంను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.