ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాజాపేట మండల ఏబీవీపీ మాజీ అధ్యక్షులు నారెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజాపేటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి నష్టపోయిన ఆయన కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు.