సినిమా ప్రియులకు తీపి కబురు: నవంబర్ 13న గీతాంజలి రీ-రిలీజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఎవర్గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి సినిమా మరోసారి థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నవంబర్ 13వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు శ్రీ పద్మిని సినిమాస్ నిర్వాహకులు తెలిపారు. మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మధురానుభూతిని పంచనుంది.