ది బ్యాట్‌మ్యాన్ 2 చిత్రంలో నటించనున్న ప్రముఖ నటుడు సెబాస్టియన్ స్టాన్

రిపోర్టర్: గోపి స్థలం: World

మార్వెల్ సూపర్‌హీరో నటుడు సెబాస్టియన్ స్టాన్ ప్రతిష్టాత్మక 'ది బ్యాట్‌మ్యాన్: పార్ట్ 2' చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను క్లాసిక్ చిత్రం 'గాడ్‌ఫాదర్ పార్ట్ 2'తో ఆయన పోల్చారు. కొత్త పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని, ఒకే రకమైన పాత్రలకు దూరంగా ఉంటున్నానని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.