'మోదీ నాయకత్వంతో దేశం అద్భుత అభివృద్ధి': వారణాసిలో చంద్రబాబు ప్రశంసలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: వారణాసి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారణాసి పర్యటనలో భాగంగా శ్రీకాశీ విశ్వనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అద్భుతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని, ఆయన నాయకత్వాన్ని చూసి దేశమంతా గర్విస్తోందని కొనియాడారు. మోదీ విప్లవాత్మక నిర్ణయాలతో రాబోయే 25 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.