విమాన ప్రయాణికులకు భారీ షాక్: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు వెల్లడించాయి. ప్రయాణికులపై అదనపు భారం పడనుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి ఈ తరహా పెంపు మూడోసారి అని విమానయాన వర్గాలు స్పష్టం చేశాయి.