రేవంత్ నిర్లక్ష్యంతోనే జూరాల జలాలు ఏపీ పరం అయ్యాయంటూ ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: Jogulamba Gadwal
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చినా తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్ల 223 టీఎంసీల జలాలు దిగువకు తరలిపోయాయని, వాటిని ఏపీ ప్రభుత్వం ఒడిసిపట్టి కుప్పం వరకు తరలించిందని వార్తలు వస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కింద సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుండగా, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం శ్రీశైలం నీటిని కుప్పం వరకు తరలించి జలహారతి నిర్వహించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.