హైదరాబాద్‌లో ఘనంగా రాజ్‌తరుణ్‌ 'టార్టాయిస్‌' మూవీ సాంగ్ లాంచ్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో రాజ్‌తరుణ్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టార్టాయిస్‌’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ‘నీ పరిచయం..’ పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఇది యూనిక్‌ థ్రిల్లర్‌ అని, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని హీరో రాజ్‌తరుణ్‌ పేర్కొన్నారు. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్‌, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రిత్విక్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.