ఊట్కూర్ లో పత్తి ధర తగ్గింపుపై రైతుల ఆందోళన

రిపోర్టర్: శివ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పత్తి ధరను ఒక్కసారిగా తగ్గించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ కాటన్ మిల్లు వద్ద ఆందోళన చేపట్టారు. నిన్నటి వరకు క్వింటాల్‌కు రూ.9,800 వరకు పలికిన ధరను తాజాగా రూ.9,200కు తగ్గించడంతో రైతులు మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరిగిన తరుణంలో ధర తగ్గించడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. పత్తికి క్వింటాల్‌కు కనీసం రూ.10 వేల గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.