సినిమా రికార్డు: ఏడాదిలో వెయ్యికి పైగా చిత్రాలు వీక్షించి గిన్నిస్ ఘనత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Pennsylvania
సంవత్సరంలో ఏకంగా వెయ్యికి పైగా చిత్రాలను థియేటర్లలో వీక్షించి అమెరికాకు చెందిన గ్లెన్వుడ్ హాస్కిన్ జూనియర్ గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు గిన్నిస్ అధికారిక వెబ్సైట్ తెలిపింది. పెన్సిల్వేనియాలోని యార్క్ హెవెన్ ప్రాంతానికి చెందిన అరై ఏళ్ల గ్లెన్వుడ్ హాస్కిన్, గత ఏడాది కాలంలో రోజూ సగటున మూడుకు పైగా సినిమాలు చూస్తూ ఈ అరుదైన మైలురాయిని సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.