ఎన్నికల సంఘం తీరుపై సీజేపీ నిప్పులు: దేశవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్తో ఢిల్లీలో నిరసనలకు దిగి పోలీసుల అదుపులో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆదివారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రంకా మీడియాతో మాట్లాడుతూ, తమ పోరాటం ఇప్పుడే మొదలైందని, గ్యానేష్ కుమార్ పదవి నుంచి తప్పుకునే వరకు ఈ నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.