ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొడుతూ కాపాడాల్సిన ప్రజాస్వామ్య బాధ్యత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
దేశంలో ఓట్ల తొలగింపు ప్రక్రియ దుర్మార్గంగా సాగుతోందని, అర్హులైన కాంగ్రెస్ అనుకూల ఓట్లను తీసివేస్తున్నారని టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం కడ్తాల్ మండలంలోని మైసిగండి ఎంఆర్జీ ఫంక్షన్ హాల్లో బీఎల్ఏలు, సూపర్వైజర్లు, ఇన్చార్జులు మరియు కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఓట్లను తొలగించకుండా కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 65 వేల మందికి నోటీసులు రాగా, చాలా మంది పత్రాలు అందించి ఓట్లు కాపాడుకున్నారని, మిగతా వారు కూడా వెంటనే స్పందించేలా బీఎల్ఏలు సహకరించాలని పిలుపునిచ్చారు.