తక్కువ బరువు ఉల్లిపాయలు ఇచ్చిన సూపర్‌మార్కెట్‌కు రూ.20 వేల జరిమానా

రిపోర్టర్: నరేష్ స్థలం: పంజాబ్

పంజాబ్‌లోని రూపార్‌లో ప్రచార ఆఫర్ కింద తక్కువ బరువు ఉన్న ఉల్లిపాయ ప్యాకెట్లను విక్రయించిన సూపర్‌మార్కెట్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.20,000 జరిమానా విధించింది. వికాస్ తాలుజా అనే వినియోగదారుడు కొనుగోలు చేసిన 4 కేజీల ఉల్లిపాయలు కేవలం 3.574 కేజీలు మాత్రమే ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. స్టోర్ సిబ్బంది నిర్లక్ష్యం, సేవల్లో లోపాన్ని తప్పుపడుతూ ప్రెసిడెంట్ కుల్జిత్ పాల్ సింగ్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.