త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను దించనున్న ఆర్బీఐ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
దేశంలో రూ.10 మరియు రూ.20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, వచ్చే 2027 ఏప్రిల్ 1 నుంచి ట్రయల్స్ ప్రారంభం కావచ్చని నివేదికలు తెలిపాయి. పాలిప్రొపిలిన్ తో తయారయ్యే ఈ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని సమాచారం అందుతోంది.